ఉంగుటూరు: బైక్ ను ఢీకొన్న కారు ఇద్దరికీ తీవ్ర గాయాలు

51చూసినవారు
ఉంగుటూరు: బైక్ ను ఢీకొన్న కారు ఇద్దరికీ తీవ్ర గాయాలు
జాతీయ రహదారి ఉంగుటూరు మండలం కైకరం వద్ద శనివారం బైక్ ను కారు ఢీ ఢీకొంది. బైక్ పై ప్రయాణిస్తున్న ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఏలూరు నుంచి తాడేపల్లిగూడెం వైపు వెళ్తున్న కారు కైకరం వద్ద బైక్ను వెనుక నుంచి ఢీ కొట్టి కారు ఆగకుండా వెళ్ళిపోయింది. స్థానికులు వెంబడించి ఉంగుటూరు టోల్ ప్లాజా వద్ద కారును అడ్డుకున్నారు. గాయపడిన వారిని హైవే పోలీసులు సిబ్బంది అంబులెన్స్ లో ఏలూరు ఆశ్రమం ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.

సంబంధిత పోస్ట్