ఉంగుటూరుకి చెందిన ఓ యువతిని చేబ్రోలుకు చెందిన రాజేశ్ వివాహం చేసుకుంటానని నమ్మించి 2021లో మరో మహిళను పెళ్లి చేసుకున్నాడు. రెండో వివాహం చేసుకుంటానని మళ్లీ యువతికి దగ్గరై వివాహేతర సంబంధం కొనసాగించాడు. కొన్నాళ్లుగా ముఖం చాటేయడంతో ఈ నెల 4న రాజేశ్ ఇంటికెళ్లి నిలదీశారు. అతడి సోదరుడు రాజు, తల్లిదండ్రులు వీర్రాజు, వెంకాయమ్మ ఆమెను దుర్భాషలాడారు. దీంతో యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.