ఉంగుటూరు మండలంలోని రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేస్తున్న ఉచిత బియ్యం ఈ నెల 15వ తేదీ వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని డీలర్ సంఘం అధ్యక్షుడు అడపా మాణిక్యాలరావు శనివారం తెలిపారు. రేషన్ కార్డుదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. డీలర్లు తమ షాపులను ప్రతి రోజు అందుబాటులో ఉంచాలని సూచించారు.