ఉంగుటూరు నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో శనివారం ఎమ్మెల్యే ధర్మరాజు 25 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నియోజకవర్గానికి 17 లక్షలు మంజూరు కాగా ఈ 10 నెలల్లో సుమారు 100 మంది లబ్ది దారులకు 1 కోటి 15 లక్షలు మంజూరు చేయించటం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.