ఉంగుటూరు మండలం బాదంపూడిలో "స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివాస్" కార్యక్రమంలో ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు శనివారం పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పరిసరాలను పరిశుభ్రం చేసి, స్వచంద్ర ప్రతిజ్ఞ చేసి అనంతరం పారిశుద్ధ్య కార్మికులను సత్కరించారు. ప్రభుత్వం చేపట్టిన "స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివాస్" నినాదంతో జరుగుతున్న ఈ ఉద్యమం మన పరిసరాలను శుభ్రంగా ఉంచటంలో ప్రతి ఒక్కరిని ప్రేరేపిస్తుందన్నారు.