అపరిశుభ్రంగా ఉంగుటూరు రైతు బజార్

52చూసినవారు
అపరిశుభ్రంగా ఉంగుటూరు రైతు బజార్
ఉంగుటూరు రైతు బజారు చెత్తతో అపరిశుభ్రంగా మారిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ మార్కెట్లో ప్రతి సోమవారం  కూరగాయల అమ్మకాలు జరుగుతుంటాయి. మిగతా రోజుల్లో బజార్ ఖాళీగా ఉంటుంది. ఈ క్రమంలో కొందరు అక్కడ చెత్త పడేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. రైతు బజార్ శుభ్రంగా ఉండేందుకు పంచాయతీ సిబ్బంది తగిన చర్యలు తీసుకోవాలంటూ ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్