ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు కూటమి నాయకులపై తీవ్రంగా మండిపడ్డారు. ఏలూరులో ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. కూటమి నేతలు రాక్షస పాలన చేస్తూ, అసెంబ్లీలోనే అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. దోచుకోవడం, దాచుకోవడంలోనే వాళ్లు మునిగిపోయారని అన్నారు. గవర్నమెంట్ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ చేయాలని చూస్తున్నారని విమర్శించారు.