ఉంగుటూరు మండలం నాచుగుంట వద్ద శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. పాలకొల్లు నుంచి ఏలూరు వైపు వెళ్తున్న కారును, నాచుగుంట వద్ద యూటర్న్ తీసుకుంటున్న లారీ ఢీకొట్టింది. దీంతో కారు ముందు భాగం నుజ్జు నుజ్జయింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న పెళ్ళికొడుకుతో పాటు మరో ఇద్దరికి గాయాలు అయ్యాయి. వెంటనే వారిని అంబులెన్స్ లో తాడేపల్లిగూడెం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ట్రాఫిక్ సమస్య లేకుండా హైవే సిబ్బంది నియంత్రించారు.