ఉంగుటూరు మండలం గొపాలపురం గ్రామంలో ప్రకృతి వ్యవసాయంపై గ్రామ సభ బుధవారం జరిగింది.
సభలో మాట్లాడుతూ డీపీఎమ్ వెంకటేష్, రైతులు ప్రకృతి వ్యవసాయాన్ని అవలంబించాలని సూచిస్తూ, ఇది భవిష్యత్ కు మార్గదర్శకంగా నిలుస్తుందన్నారు. పంటలో చీడపీడలు ఉధృతి తగ్గుతుందని, కలుపు సమర్థవంతంగా నివారించబడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయ చేస్తున్న రైతులను సన్మానించారు.