ఓటర్ల జాబితా వెరిఫికేషన్ పై ఉంగుటూరు నియోజవర్గ స్థాయి రాజకీయ నాయకుల ప్రతినిధుల సమావేశం బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు స్థానిక తహసిల్దార్ కార్యాలయం వద్ద జరుగుతుందని ఎన్నికల డిటి పోతురాజు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏలూరు ఆర్డీవో అచ్యుత్ అంబరీష్ అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుందన్నారు. ఉంగుటూరు నియోజకవర్గంలోని నాలుగు మండలాల నుండి అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు హాజరుకావాలని కోరారు.