ఉంగుటూరు మండల పరిషత్ కార్యాలయంలో ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్లతో ఎంపీడీవో మనోజ్ సమీక్షా సమావేశం నిర్వహించారు. పనిదినాలు పెంచాలని, పని ప్రదేశంలో వసతులు కచ్చితంగా ఉండాలన్నారు. రోజు వారి వేతనం పెరిగేలా కూలీల చేత పని చేయించాలని, కూలీలకు వడ దెబ్బతగలకుండా ఉదయం ఆరు గంటలకు పనిలోకి వచ్చేలా పది, పద కొండు లోపే వెళ్ళి పోయేలా చర్యలు తీసుకోవాలని ఎంపీడీఓ బుధవారం సూచించారు.