ఉంగుటూరు గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా
సోమవారం రక్తదాన శిబిరాన్ని గ్రామ సర్పంచ్ బండారు సింధు మధుబాబు ప్రారంభించారు. ఈ రక్తదాన శిబిరంలో గ్రామ సర్పంచ్ ప్రథమ పౌరురాలు ముందుగా రక్తదానం చేశారు. అంతకముందు అంబేడ్కర్ విగ్రహానికి పలువురు పూలమాలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో వార్డు మెంబర్లు, గ్రామ పంచాయతీ సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.