అంబేడ్కర్ అడుగుజాడల్లో నడవాలని ఉంగుటూరు ఎంపీపీ గంటా శ్రీలక్ష్మి అన్నారు. సోమవారం ఉంగుటూరు దళితపేటలో డాక్టర్ బి. ఆర్ అంబేడ్కర్ జయంతి వేడుకలు జరిగాయి. వేడుకలలో అంబేడ్కర్ విగ్రహానికి తెలుగుదేశం, జనసేన, వైఎస్ఆర్ సీపీ నాయకులు, ప్రజా ప్రతినిధులు పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం అన్న సమారాధన కార్యక్రమం జరిగింది.