ఈ జగన్‌కు ఏమైందంటూ టీడీపీ ట్విట్టర్‌లో వ్యంగ్యంగా స్పందించింది. ప్రతిపక్ష హోదా లేదు కానీ హోదా కావాలని, సీఎం పదవి లేదు కానీ ఆ స్థాయి సెక్యూరిటీ కావాలని ఆయన కోర్టుకు వెళ్లారని ఎద్దేవా చేసింది. 'నిన్నటి వరకు ప్రతిపక్ష హోదా, ఇవాళ సీఎం స్థాయి సెక్యూరిటీ కావాలంటున్నాడు. అయ్యా సైకియాట్రిస్టులు తన పొజిషన్ ఏంటో ఆయనకు అర్థమయ్యేలా చెప్పండయ్యా' అని టీడీపీ సెటైర్లు వేసింది. ఈ ట్వీట్‌పై వైసీపీ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.