ఆకాశ్ మిసైల్ అనేది భారత స్వదేశీ సాంకేతికతతో రూపొందిన శక్తివంతమైన రక్షణ క్షిపణి వ్యవస్థ. ఇది గగనతలంలో శత్రు డ్రోన్లు, యుద్ధ విమానాలు, క్షిపణులను కూల్చివేయగలదు. భూమి నుంచి గగనంలోకి ప్రయోగించే ఈ క్షిపణి 30 కి.మీ. పరిధి కలిగి ఉండి, అన్ని వాతావరణాల్లో పనిచేస్తుంది. "ఆకాశ్" అంటే గగనం లేదా ఆకాశం. ఈ పేరు సముచితంగానే ఈ క్షిపణి గాలిలో శత్రువులను చేధించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.