స్వాతంత్య్రం అనేది ఒకరు మరొకరిని ఇబ్బంది పెట్టకుండా, తను ఇతరుల వలన ఇబ్బంది పడకుండా స్వేచ్ఛగా, హాయిగా, ఆనందంగా గడపడానికి లభించిన హక్కు. స్వాతంత్య్రం అనేది ఒక వ్యక్తికి, రాష్ట్రానికి లేదా దేశానికి సంబంధించిన స్థితి, దీనిలో నివాసితులు, జనాభా లేదా దానిలో కొంత భాగం, దాని భూభాగంపై స్వయం-ప్రభుత్వం, సాధారణంగా సార్వభౌమాధికారాన్ని అమలు చేస్తారు. ఇతర దేశాల నుండి పాలనా పరమైన ఆదేశాలకు లోబడకుండా స్వేచ్ఛగా పాలింపబడుటకు నిర్మించబడటం అనేది స్వాతంత్య్రం పొందటం.