👉డేటా తీసుకునే సంస్థను ‘డేటా ఫిడిషిరీ’ అని, డేటా ఇచ్చే వినియోగదారుడ్ని ‘డేటా ప్రిన్సిపల్’ అని అంటారు.
👉వినియోగదారుడి అనుమతి లేకుండా డేటా తీసుకోవడం కొత్త చట్టం ప్రకారం నేరం. ఒకవేళ అలా తీసుకోవాలంటే అందుకు కారణాలను వినియోగదారుడికి చెప్పాలి.
👉వినియోగదారులు కూడా బ్యాంకులు వంటి సంస్థలకు కచ్చితమైన సమాచారమే ఇవ్వాలి. తప్పుడు సమాచారం ఇచ్చినా జరిమానా విధిస్తారు.
👉18 ఏళ్లలోపు వారి వివరాలు తీసుకోవాలంటే తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి.