వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డిపై వైసీపీ చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూటమి ప్రభుత్వ పనితీరు బాగుందని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా వైసీపీ అలా చేసి ఉంటే బాగుండేది.. ఇలా చేయకుండా ఉంటే బాగుండేదని చెప్పుకొచ్చారు. ఈ పరిణామాలు పార్టీ ప్రతిష్టను దెబ్బ తీస్తున్నాయని గమనించిన అధిష్ఠానం కేతిరెడ్డిపై చర్యలకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.