ఆవు పాలలో కేసిన్ అనే ప్రొటీన్ ఎక్కువ మోతాదులో ఉంటుంది. ఈ ప్రొటీన్ కడుపులోకి వెళ్లాక ముక్కలు ముక్కలుగా విడిపోతుంది. దీంతో ఆహారం జీర్ణమవడం కష్టమవుతుంది. అదే తల్లిపాలలో ఈ ప్రొటీన్ తగినంత పరిమాణంలో ఉండడం వల్ల శిశువుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆహారం జీర్ణమవుతుంది. తల్లిపాలలో ఉండే లినోయిన్ ఆమ్లం శిశువు సంపూర్ణ వికాసానికి దోహదపడుతుంది. తల్లి పాలలో ఐరన్ 50 శాతం ఉంటుంది. ఆవు పాలతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ.