మూత్రపిండాల్లో కాల్షియం అధికాంగా పేరుకుపోతే అది రాళ్లుగా ఏర్పడుతుంది. అయితే కిడ్నీల్లో రాళ్లు పడకుండా ఉండాలంటే "రోజుకు కనీసం 3 లీటర్ల నీరు తాగాలి. ఆహారంలో ఉప్పు వాడకం తగ్గించాలి. కాల్షియం ఎక్కువగా ఉండే పాలు, ఆకుకూరలు, పండ్లు తీసుకోవాలి. బరువును అదుపులో ఉంచుకోవాలి. ప్రతి రోజూ కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేయాలి. ముఖ్యంగా ఆల్కహాల్, స్మోకింగ్ మానేయాలి." అని నిపుణులు చెబుతున్నారు.