AP: నాగమల్లేశ్వరరావు భార్యా, కూతురికి సీఎం చంద్రబాబు ఏం సమాధానం చెబుతారని వైసీపీ అధినేత వైఎస్ జగన్ నిలదీశారు. "ఏడాది గడిచినా సరే నాగమల్లేశ్వరరావు ఇంటిపై దాడి చేసిన వాళ్లపై చర్యలు తీసుకోలేదు. వెంకటేశ్వరరావు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. నాగమల్లేశ్వరరావును బెదిరించిన ఆ సీఐపై చంద్రబాబు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఏడాది గడిచినా ఆ కుటుంబం ఇంకా శోకంలోనే ఉంది." అని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు.