భారత నంబర్లతో వాట్సాప్ అకౌంట్లు క్రియేట్ చేయడంలో పాకిస్థానీలకు సహకరించిన ఏడుగురిని అస్సాం పోలీసులు అరెస్ట్ చేశారు. మిలిటరీ ఇంటిలిజెన్స్ నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా మే 14న 'ఆపరేషన్ ఘోస్ట్ సిమ్' నిర్వహించామని అస్సాం డీజీపీ తెలిపారు. ఈ అకౌంట్ల ద్వారా సైబర్ నేరాలు, దేశవిరుద్ధ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు గుర్తించామని చెప్పారు. అరెస్టుల్లో TGలోని సంగారెడ్డి జిల్లా వ్యక్తి కూడా ఉన్నట్టు వెల్లడించారు.