ఏపీలో కూటమి సర్కారు విజన్ పాలన సాగిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పాలనను మరింతగా ప్రజలకు చేరువ చేసేందుకు వాట్సాప్ గవర్నె న్స్ పేరుతో సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ వాట్సాప్ పాలన పూర్తిగా మంత్రి నారా లోకేష్ వ్యూహం, ఆలోచన మేరకు తీసుకువచ్చిందని సీఎం చంద్రబాబు సైతం చెప్పుకొచ్చారు. మొత్తంగా చూస్తే.. వాట్సాప్ పాలనపై సంతృప్తి బాగానే ఉందని అధికారులు చెబుతున్నారు. మరింత సక్సెస్ అయ్యేందుకు కనీసం నెల రోజుల సమయం పడుతుందని వెల్లడిస్తున్నారు.