TG: హైదరాబాద్ మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో క్రెడిట్ కార్డు బిల్లు కోసం వెళ్లిన ఓ ఏజెంట్‌పై యజమాని కుక్కని వదిలాడు. జవహర్ నగర్‌కు చెందిన నందివర్ధన్ క్రెడిట్ కార్డు ద్వారా రెండు లక్షల అప్పు కట్టాల్సి ఉంది. అయితే రికవరీ చేయడానికి వచ్చిన ఏజెంట్ సత్య నారాయణపై కుక్కను వదలడంతో ఒక్కసారిగా మీద పడి దాడి చేసింది. గాయాల పాలైన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.