AP: ఇచ్చిన హామీలను ఎప్పుడు నెరవేరుస్తారని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. శనివారం ఆయన పార్వతీపురంలో మాట్లాడారు. ‘40 శాతం ఓట్లు ఉన్న మాకు ప్రజలు తరపున అడిగే హక్కు ఉంది. ఏడాది పాలనలో ఉద్యోగాలు తీసి, నిరుద్యోగ భృతి మాట లేకుండా చేశారు. నిరుద్యోగ భృతి రూ.36 వేలు ఎప్పుడు ఇస్తారు?. తాము హామీల అమలు కోసం మేనిఫెస్టోను జేబులో పెట్టుకుని తిరిగితే, కుటమి నేతలు అమలు చేయలేక బిరువాలో పెట్టారు’ అని బొత్స దుయ్యబట్టారు.