27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. ఢిల్లీలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ఇప్పుడు ఎవరిని ముఖ్యమంత్రిని చేస్తుందనే దానిపై అందరి దృష్టి మళ్లింది. ప్రస్తుతం ఈ రేసులో ప్రవేశ్ సింగ్ వర్మ, మనోజ్ తివారీ, మంజీందర్ సింగ్ సిర్సా, స్మృతి ఇరానీ, విజేందర్ గుప్తా, మోహన్ సింగ్ బీష్ట్, వీరేంద్ర సచ్‌దేవా ఉన్నారు. వీరిలో ఒకరి పేరును బీజేపీ పార్లమెంటరీ సమావేశం తర్వాత మోడీ ప్రకటించనున్నారు.