విజయసాయి రెడ్డికి ఎవరిపై ప్రేమ పుట్టిందో?: అమర్‌నాథ్

61చూసినవారు
విజయసాయి రెడ్డికి ఎవరిపై ప్రేమ పుట్టిందో?: అమర్‌నాథ్
AP: సిఐడి విచారణ అనంతరం మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ కౌంటర్ ఇచ్చారు. విజయసాయి రెడ్డికి ఎవరిపై ప్రేమ పుట్టిందో? అందుకే జగన్‌పై మనసు విరిగిందని అంటున్నారని అన్నారు. ఒకరిపై ప్రేమ పుడితేనే మరొకరిపై మనసు విరుగుతుందని విమర్శించారు. 'జగన్ 2024లో అధికారంలోకి వచ్చి ఉంటే విజయసాయి ఇలా మాట్లాడేవారా?.. ఆయన వ్యవసాయం చేయరని, రాజకీయం మాత్రమే చేస్తారని నిన్న చేసిన వ్యాఖ్యలతో అర్థమైంది' అని అన్నారు.

సంబంధిత పోస్ట్