ప్రసార భారతి ఛైర్మన్‌గా మాజీ ఐఏఎస్ అధికారి నవనీత్ కుమార్ సెహగల్ నియమితులయ్యారు. సెలక్షన్ కమిటీ సిఫారసు మేరకు రాష్ట్రపతి ఈ నియామకాన్ని ఆమోదించారు. గతంలో ఛైర్మన్‌గా ఉన్న సూర్యప్రకాశ్ పదవీకాలం 2020లో ముగిసింది. అప్పటి నుంచి ఈ పోస్టు ఖాళీగా ఉంది. ఇక నవనీత్ బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి మూడేళ్ల వరకు లేదా 70 ఏళ్లు వయోపరిమితి వచ్చే వరకు ఈ పదవిలో సెఘాల్ కొనసాగుతారు.