సీఎం ఎవరనేది అధిష్ఠానం చేతుల్లోనే: పర్వేశ్‌ వర్మ

63చూసినవారు
సీఎం ఎవరనేది అధిష్ఠానం చేతుల్లోనే: పర్వేశ్‌ వర్మ
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంతో ఇప్పుడు సీఎం ఎవరా అనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మాజీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌పై విజయం సాధించిన పర్వేశ్‌ వర్మ సీఎం అవుతారని ప్రచారం మొదలైంది. ఈ ప్రచారంపై పర్వేశ్ స్పందించారు. ముఖ్యమంత్రి ఎవరనేది అధిష్ఠానమే నిర్ణయిస్తుందని వ్యాఖ్యానించారు. కాగా, సీఎం రేసులో ప్రధానంగా పర్వేశ్‌ వర్మ పేరే వినిపిస్తోంది.

సంబంధిత పోస్ట్