AP: విశాఖలో ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబుకు కేటాయించిన భూమిని ఎందుకు రద్దు చేశారు? అని సీఎం చంద్రబాబును వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రశ్నించారు. బుధవారం పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాళ్ల గ్రామంలో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో ఆయన మాట్లాడారు. "ప్రముఖ నడుడు పోసాని కృష్ణమురళి వైసీపీ పార్టీ సానుభూతిపరుడు మాత్రమే. అలాంటి పోసానిపై 9 కేసులు పెట్టి నెలరోజుల పాటు వేధించారు." అని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు.