ఇవాళ హిందువులు ప్రదోష వ్రతం చేసుకోనున్నారు. హిందూ ధర్మ శాస్త్రం ప్రకారం ప్రదోష వ్రతానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. నేడు దేవాలయంలో దేవతలకు పూజలు జరుగుతాయి. ముఖ్యంగా శివునికి ఈ రోజు ప్రీతికారమైన రోజు అని పండితులు అంటున్నారు. ప్రదోష వ్రతం చేయడం వల్ల జీవితంలో సుఖ సంతోషాలు, సంపదలు పెరుగుతాయని చెబుతున్నారు.