AP: ‘త్వరలోనే టీడీపీలో చేరుతా’ అని రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడారు. ఎంపీ విజయసాయి రెడ్డి పోస్టుపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఏపీకి సీఎం ఎవరనేది ప్రజలు నిర్ణయించారు. వైసీపీ అధ్యక్షుడు ఎవరో మీరు నిర్ణయించుకోండి’ అంటూ కౌంటర్ వేశారు. జగన్‌ను ప్రజలు తిరస్కరించారు కాబట్టే 11 సీట్లకు పరిమితం చేశారని విమర్శించారు. ప్రతి స్కాంకు జగనే కారణమన్నారు.