ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విపక్ష వైసీపీకి, అధికార పార్టీలైన టీడీపీ, జనసేన, బీజేపీలకు మధ్య సాగుతున్న పోరు నిత్యం చూస్తూనే ఉన్నాం. వైసీపీ వర్సెస్ కూటమిగా సాగుతున్న ఏపీ రాజకీయాల్లో ఇవాళ ఓ ట్విస్ట్ చోటు చేసుకుంది. పార్లమెంట్ సాక్షిగా వైసీపీ ఎంపీ, మాజీ ఫ్లోర్ లీడర్ అయిన పీవీ మిథున్ రెడ్డి.. టీడీపీ ఎంపీలతో కలిసి పోలవరం ప్రాజెక్ట్ ఎత్తు విషయంలో కేంద్రంతో పోరాడేందుకు సిద్దమని పార్లమెంట్ లోనే తేల్చిచెప్పేశారు.