AP: గుంటూరు మిర్చి యార్డ్ సందర్శన సందర్భంగా తన భద్రతపై వైసీపీ అధినేత జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రైతులను పరామర్శించడానికి వచ్చిన తనకు సీఎం చంద్రబాబు కనీసం పోలీసు భద్రత కూడా ఇవ్వడం లేదని మండిపడ్డారు. ఎల్లకాలం మీ ప్రభుత్వం ఉండదని, రేపు తాము అధికారంలోకి వచ్చాక కూడా ఇలాగే భద్రత ఇవ్వకపోతే ఎలా ఉంటుందో ఆలోచించాలన్నారు. మీరు చేస్తుంది కరెక్టో కాదో మీరే ఆలోచించుకోవాలని జగన్ అన్నారు.