
పవన్ కళ్యాణ్‌తో సినిమా చేయాలని ఉంది: ధనుష్
తనకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో సినిమా చేయాలని ఉందని దర్శకుడు, కోలీవుడ్ ప్రముఖ నటుడు ధనుష్ వెల్లడించారు. హైదరాబాద్‌లో జరిగిన 'కుబేర' సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్లో ధనుష్ ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'తమిళ్లో మీరు కొన్ని సినిమాలకు దర్శకత్వం వహించారు. తెలుగులో ఏ హీరోతో సినిమా చేయాలనుకుంటున్నారు?' అని సుమ అడిగిన ప్రశ్నకు 'పవన్ కళ్యాణ్' అని ధనుష్ సమాధానం ఇచ్చారు. కుబేర జూన్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.