దేశ రాజధానిపై కాషాయ జెండా ఎగరేయడానికి దాదాపు 27 ఏళ్లుగా బీజేపీ ఎదురు చూస్తోంది. యమునా నదిలో విషం, రామాయణం వ్యాఖ్యలను ఆ పార్టీ గట్టిగానే తిప్పికొట్టింది. ఆప్‌ది అవినీతి ప్రభుత్వమనే విమర్శలతోనూ ఇరకాటంలో పెట్టి పోటాపోటీగా తలపడింది. ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్లుగానే ట్రెండ్స్ కూడా వస్తుండటంతో 27 ఏళ్ల తర్వాత ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ఆ పార్టీ నేతలు ధీమాగా ఉన్నారు.