ఏపీలో మద్యం ధరలు ఎక్కువగా ఉన్నాయన్న విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వం ధరలు తగ్గించేందుకు చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా టెండర్ కమిటీని ఏర్పాటు చేయబోతోంది. అయితే టెండర్ కమిటీ ఏర్పాటు చేసినా.. మద్యం ధరలు తగ్గకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అధిక ధరలున్న కొన్ని బ్రాండ్ల ధరలను మాత్రం సవరించే అవకాశాాలున్నాయి. అయితే క్వాలిటీ మద్యం సరఫరా చేస్తున్న ప్రభుత్వం ఎక్కడా ధరలు తగ్గిస్తామని మాత్రం బహిరంగంగా చెప్పడం లేదు.