ఏసీబీకి లేఖ రాస్తా: రఘురామ

60చూసినవారు
ఏసీబీకి లేఖ రాస్తా: రఘురామ
AP: న్యాయవాదిగా ప్రాక్టీస్ చేయని కామేపల్లి తులసిబాబును సీఐడీ కేసుల్లో లీగల్ అసిస్టెంట్‌గా నియమించి రూ.48 లక్షలు చెల్లించడంపై విచారణ కోసం ఏసీబీకి లేఖ రాస్తానని డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు తెలిపారు. తనపై జరిగిన కస్టోడియల్ టార్చర్ కేసుకు సంబంధించి న్యాయమూర్తి ఎదుట 164 స్టేట్‌మెంట్ ఇచ్చేందుకు ఆయన బుధవారం గుంటూరు జిల్లా జైలుకు వచ్చారు. 12 కేసుల్లో సహకరించినందుకు తులసిబాబుకు సీఐడీ రూ.48 లక్షలు చెల్లించిందని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్