హైదరాబాద్‌లోని జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. రాధిక(40) అనే మహిళా భర్త చనిపోయిన నాటి నుంచి కల్లుకు బానిస అయింది. ఈ క్రమంలో గురువారం ఓవర్ హెడ్ ట్యాంక్ ఎక్కి పైనుంచి దూకే ప్రయత్నం చేసింది. అయితే అక్కడ ఉన్న స్థానికులు ఆమెను కాపాడారు.