AP: అనంతపురం జిల్లా, గుమ్మఘట్ట మండలం దేవరెడ్డిపల్లిలో విషాద ఘటన చోటుచేసుకుంది. రాధిక (33) బుధవారం ఉదయం ఇల్లు తుడుస్తోంది. ఫ్రిడ్జ్‌కున్న విద్యుత్తు తీగ తెగి పక్కనే ఉన్న ఇనుప బీరువాకు తగులుకుని విద్యుత్తు సరఫరా అయ్యింది. కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. మృతురాలికి భర్త రవి, ఐదేళ్ల కవల పిల్లలు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.