మహిళకు మత్తు ఇంజక్షన్ ఇచ్చి నగలు చోరీ!

64చూసినవారు
మహిళకు మత్తు ఇంజక్షన్ ఇచ్చి నగలు చోరీ!
AP: తిరుపతి జిల్లా కోటలోని స్థానిక NCR నగర్‌లో నివాసం ఉంటున్న ప్రమీల అనే మహిళ అనారోగ్యానికి గురైంది. దీంతో నెల్లూరులోని ఓ హాస్పిటల్‌లో పనిచేస్తున్న సంపత్ అనే వ్యక్తి వారానికోసారి వారి ఇంటికి వచ్చి ఆమెకు ట్రీట్మెంట్ చేసేవాడు. ఈ నెల 10న ట్రీట్మెంట్ చేయడానికి వచ్చిన సంపత్ ఆమెకు పెయిన్స్ తగ్గేందుకు ఇంజక్షన్ ఇచ్చాడు. దీంతో ప్రమీల మత్తులోకి జరుకోగా సంపత్ ఆమె చేతికి ఉన్న ఆరు సవర్ల గాజులను తీసుకుని పారిపోయాడు. ఈ మేరకు ప్రమీల ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్