AP: పింఛన్ కోసం లంచం అడిగారని ఓ మహిళ బంగారాన్ని తాకట్టు పెట్టారు. ఈ ఘటన శ్రీసత్యసాయి జిల్లా చిలమత్తూరులో చోటు చేసుకుంది. హిందూపురం మోడల్ కాలనీకి చెందిన ఓ మహిళ తన చెవి దుద్దులు తాకట్టు పెట్టేందుకు ఓ బంగారం దుకాణానికి వెళ్లారు. అక్కడే ఉన్న వ్యక్తి ఎందుకు చెవి దుద్దులు తాకట్టు పెడుతున్నారని అడిగారు. దాంతో మహిళ పింఛన్ కోసం లంచం అడిగారని, డబ్బులు ఇవ్వకపోతే పింఛన్ రాదని చెప్పినట్లు మహిళ పేర్కొన్నారు.