రోడ్డు ప్రమాదంలో మహిళలు మృతి.. సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి

68చూసినవారు
రోడ్డు ప్రమాదంలో మహిళలు మృతి.. సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
AP: శ్రీ సత్యసాయి జిల్లాలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దొడగట్ట గ్రామానికి చెందిన అలివేలమ్మ, ఆదిలక్ష్మీ, సుంకమ్మ అనే ముగ్గురు మహిళలు మృత్యువాత పడటంపై విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ప్రమాదంలో గాయపడిన మరో 10 మంది క్షతగాత్రులకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్