AP: ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే బూసినే విరూపాక్షి తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో నీళ్లు దొరకకపోవచ్చు కానీ మద్యం ఏరులై పారుతోందని ఆరోపించారు. బెల్టుషాపులు లేకుండా జగన్ చేస్తే.. సీఎం చంద్రబాబు వీధికొక వైన్‌షాప్ పెట్టాడంటూ వ్యాఖ్యానించారు. ఉదయం 5గం. నుంచి రాత్రి 11గం. వరకు మద్యం షాపులను నిర్వహిస్తున్నారని, రాష్ట్రంలో మహిళలు ఒంటరిగా తిరిగే పరిస్థితి లేదని అన్నారు. మహిళలపై అఘాయిత్యాలు రోజురోజుకూ ఎక్కువైపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.