AP: అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లోని బ్రాండిక్స్ పరిశ్రమ వద్ద మహిళా ఉద్యోగులు ఇవాళ నిరసన తెలిపారు. తెల్లవారు జామున 3 గంటలకు ఇంటి నుంచి బస్సులో బయలుదేరి పరిశ్రమకు వచ్చి.. రాత్రి 10.30 గంటల వరకు పనిచేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పదేళ్లుగా వేతనాలు పెంచకపోగా, ఆదివారం కూడా పనిచేయిస్తూ కుటుంబాలకు దూరం చేస్తున్నారని ఆరోపించారు. సీఐటీయూ ఆధ్వర్యంలో పరిశ్రమ గేటు ముందు బైఠాయించి నినాదాలు చేశారు.