ప్రపంచంలోనే అత్యంత వృద్ధ మహిళ కన్నుమూత

83చూసినవారు
ప్రపంచంలోనే అత్యంత వృద్ధ మహిళ కన్నుమూత
ప్రపంచంలోనే అత్యంత వృద్ధ మహిళగా గిన్నిస్‌ రికార్డు సృష్టించిన టొమికో ఇటూక (116) కన్నుమూశారు. డిసెంబర్ 29న ఆషియా నగరంలో మరణించినట్లు అధికారులు తెలిపారు. ఈమె జపాన్‌లోని ఒసాకాలో 1908 మే 23న జన్మించారు. 2024లో ప్రపంచలోనే అత్యంత వృద్ధ మహిళగా గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కిన టొమికో ఇటూకకు పర్వతారోహకురాలిగా మంచి గుర్తింపు ఉంది. జపాన్‌లోని 3,067 మీటర్ల ఎత్తైన మౌంట్ ఆన్టేక్ పర్వతాన్ని టొమికా రెండు సార్లు అధిరోహించారు.

సంబంధిత పోస్ట్