పోలవరం ప్రాజెక్టు పూర్తి కావడం వైసీపీకి ఇష్టం లేదు: మంత్రి నిమ్మల

74చూసినవారు
పోలవరం ప్రాజెక్టు పూర్తి కావడం వైసీపీకి ఇష్టం లేదు: మంత్రి నిమ్మల
AP: పోలవరం ప్రాజెక్టు పూర్తి కావడం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఇష్టం లేదని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు విమర్శించారు. మంగళవారం మంత్రి నిమ్మల పోలవరం ప్రాజెక్టు పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించి మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన డయా‌ఫ్రమ్ వాల్ మందం 1.5 మీటర్ల నుంచి 0.9 మీటర్లకు తగ్గించేస్తున్నారంటూ వైసీపీ అబద్ధాలు ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీస అవగాహన లేకుండా మాట్లాడవద్దని హితవు పలికారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్