విజయవాడ పరిస్థితులపై వైఎస్ జగన్ చేసిన విమర్శలపై సినీ నటుడు బ్రహ్మాజీ ఎక్స్ వేదికగా సెటైర్లు వేశారు. దీనిపై వైసీపీ నేత ప్రదీప్ రెడ్డి చింత కౌంటరిచ్చారు. ‘ఒక విషయం గుర్తు పెట్టుకో బఫూన్ బ్రహ్మాజీ. సినిమాల్లో కామెడీ చెయ్.. చిల్లర డబ్బులు రాలుతాయి. కానీ సీరియస్ మ్యాటర్‌లో కామెడీ చేస్తే మూతి పళ్లు రాలుతాయి.’ అంటూ వార్నింగ్ ఇచ్చారు. ఈ క్రమంలో బ్రహ్మాజీ ఎక్స్‌లో వివాదాస్పద పోస్ట్ డిలీట్ చేశారు.