AP: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడంపై ఆ పార్టీ ఏపీ అధ్యక్షురాలు, ఎంపీ పురందేశ్వరి స్పందించారు. ఆదివారం విశాఖలో ఆమె మీడియాతో మాట్లాడారు. ‘దేశవ్యాప్తంగా ఎక్కడ ఎన్నికలు జరిగినా కాషాయజెండా రెపరెపలాడుతోంది. 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో అధికారంలోకి వచ్చాం. కార్యకర్తల కృషి వల్లే ఈ విజయం సాధ్యమైంది. ఏపీలో గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధిని నిర్లక్ష్యం వహించింది. దోచుకోవడంపైనే వైసీపీ నేతలు దృష్టి పెట్టారు.’ అని అన్నారు.