పోలవరం పనులపై వైసీపీ అబద్ధాలు: మంత్రి నిమ్మల

60చూసినవారు
పోలవరం పనులపై వైసీపీ అబద్ధాలు: మంత్రి నిమ్మల
AP: పోలవరం ప్రాజెక్ట్ పనులపై వైసీపీ కరపత్రికలో అబద్ధాలు ప్రచురిస్తున్నారంటూ ఏపీ నీటిపారుదలశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. వైసీపీ హయాంలో పోలవరాన్ని నిర్లక్ష్యం చేయడంతోనే ఆ ప్రాజెక్టు భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని విమర్శించారు. రాజమహేంద్రవరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పోలవరంలో జరుగుతున్న పనుల్లో పురోగతిని వివరించారు. ఇప్పటికే అంతర్జాతీయ నిపుణులు 4 సార్లు పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించారని చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్